5, ఫిబ్రవరి 2009, గురువారం

నందమూరి రామాయణం

ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు,
నమస్కారము.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రులు ఆప్యాయంగా "అన్న" అని పిలుచుకొన్న మహనీయుడు, మనపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు.
ఆయనజీవిత జీవిత చరిత్రను "నందమూరి రామాయణం" అనే అల్బమ్ గా రూపొందించే అవకాశం నాకు కలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 'రజతోత్సవ మహానాడు'న ఈ సి.డి.ని మన ప్రియతమా నాయకులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆవిష్కరించిన విషయం మీకు తెలిసిందే.
బడుగు, బలహీన, కార్మిక, కర్షక, వర్గాలను రాజకీయ భాగస్వాముల్ని చేసుకొని, సామజిక న్యాయం కోసం నూతన, గుణాత్మకమైన రాజకీయ పంథాను అనుసరించిన "అన్న" గారి ఆలోచనా సరళి భావితరాలకు స్ఫూర్తిదాయకం.
ఆ మహనీయుని జీవిత చరిత్రను, తెలుగుజాతి ఔన్నత్యానికి ఆయన చేసిన కృషిని నవతరానికి తెలియచేయుటలో ఈ సి.డి. ఉపయుక్తం కాగలదని నా నమ్మకం.

భవదీయుడు
చందు సాంబశివరావు
టి.డి.పి. ఇంచార్జి,
దుగ్గిరాల నియోజకవర్గము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి