19, డిసెంబర్ 2008, శుక్రవారం

శ్రీ చందు సాంబశివరావు

శ్రీ చందు సాంబశివరావు


శ్రీ చందు సాంబశివరావు గారు 09-09-1964 న గుంటూరు జిల్లా, కాకర్లమూడి గ్రామంలో శ్రీ చందు వీరరగావయ్య, బసవపూర్ణమ్మ దంపతులకు జన్మించారు.ఒక సామాన్య రైతు కుటుంబంలోజన్మించిన చందు సాంబశివరావు గారు ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనూ,ప్రాథమికోన్నత విద్యను కుచ్చెళ్ళపాడు, అనంతవరం గ్రామాలలో పూర్తి చేశారు.

తెనాలిలోని వి.ఎస్.అర్. & ఎన్.వి.అర్. కళాశాలలో ఇంటర్మీడియట్ ముగించి, కర్ణాటక రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి 1986 లో బి.ఈ. డిగ్రీ పొందిన తదుపరి భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) లో శాస్త్రవేత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం (వి.ఎస్.ఎస్.సి.,తిరువునంతపురం) లో 1992 వరకు బాధ్యతలు నిర్వ హిస్తూ ఆ తదుపరి ఉన్నత విద్య కోసంఅమెరికా వెళ్లారు.

యూనివర్సిటీ ఆఫ్ కెంటకి,యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ లలో రెండు యం.ఎస్. డిగ్రీలు సంపాదించిన తదుపరి నాసా (NASA) లో ఇంజనీరుగా బాధ్యతలు చేపట్టినారు 1992 నుండిఅమెరికా లో నివసిస్తున్న మన చందు పలు బహుళజాతి సంస్థలలో వివిధ హోదాలలో పదవీబాధ్యతలు నిర్వహిస్తూనే జాన్స్ హాప్ కిన్స్ యునివర్సిటీలో ఎం.బి.ఎ. డిగ్రీ సంపాదించారు.వారాంతపు దినాలలోవర్జీనియా రాష్ట్రంలోని కమ్యూనిటీ కాలేజీలలో ప్రొఫెసర్ గా 5 సంవత్సరాలు ఐ.టి. మరియు వాణిజ్య విభాగాలలో వివిధ కోర్సులు బోధించుట మన చందు సాంబశివరావు గారి విద్యాతృష్ణకు నిదర్శనం.

సర్టిఫైడ్ ప్రోజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ (పి.ఎం.పి.) అయిన మన చందు వివిధ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.ఐ.టి. రంగంలోనూ , మేనేజ్ మెంట్ రంగంలోనూ అత్యున్నతగుర్తింపు పొందిన భారతీయులలో మన చందు గారిది ప్రత్యేక స్థానం.

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.ప్రాంతంలో స్థిరపడిన మన చందు సాంబశివరావు గారు ఆ ప్రాంతపు తెలుగు కమ్యూనిటీ మరియు తానా కార్యక్రమాలను జయప్రదం చేయుటకు తోడ్పడినారు.

ఎన్.ఆర్.ఐ. గ స్థిరపడిన మన చందు సాంబశివరావు గారు జన్మభూమి ఫై మమకారంతో మన వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.విద్యారంగంలోనూ, ప్రకృతి విపరీత్యాల బాధితులకు, ఆరోగ్య రంగానికి ఆర్ధిక సహకారం అందించారు.అంతే కాకుండా పలు ప్రాంతాలలోని గ్రామాలలో వయోవృద్ధులకు , వికలాంగులకు, పేదల అభివృద్ధి కొరకు ఆర్ధికంగా చేయూతనిస్తూ, మిత్రులు, సహోద్యోగులను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేసారు.ఆయా గ్రామ ప్రజల కోరిక మేరకు పలు గ్రామాలలో పాఠశాలలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల నిర్మాణానికి, అభివృద్ధికి తనవంతు ఆర్ధిక సహయాయ సహకారాలను అందించారు.

ఈ నేపద్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు మన చందు సాంబశివరావు గారు అందించిన సేవలకు గుర్తింపుగా, మన రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎన్.డి.తివారి గారు ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు.

ప్రఖ్యాత రచయిత, తన మేనమామ కీర్తి శేషులు శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని పలు తెలుగు రచయితలను, కళాకారులను అభినందిస్తూ, ఆదరిస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న మక్కువను చాటుకొంటూ సాహిత్య కళారంగాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

తెలుగు జాతిని అభివృద్ధి పరచాలనే తపన మన చందు సాంబశివరావు గారిని క్రియాశీలక రాజకీయాల వైపు మళ్ళించింది.

ఈ నేపద్యంలో మన 'అన్న' స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి నిస్వార్ద సేవ,శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనా విధానాలు, పరిపాలనా దక్షతా, మన చందు గారిని ఎంతో ప్రేరేపించాయి.మిత్రుల ప్రోత్సాహంతో మరియు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2004 అసెంబ్లీ ఎన్నికలలో దుగ్గిరాల నియోజకవర్గం నుండి టి.డి.పి. అభ్యర్ధిగా పోటీ చేశారు.

2004 నుండి దుగ్గిరాల నియోజకవర్గ టి.డి.పి. ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజాసేవకు నియోజక వర్గ ప్రజానీకంతో మమేకమై, ప్రజల అభివృద్ధికి, పార్టి అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇక్కడే ఉంటూ, పూర్తి సమయాన్ని పార్టి కార్యకలాపాలకు కేటాయిస్తున్న మన చందు సాంబశివరావు గారి కృషికి తోడు, అన్ని వర్గాల ప్రజానీకం, స్థానిక, జిల్లా మరియు రాష్ట్ర నాయకులు అందిస్తున్న ప్రోత్సాహం దుగ్గిరాల నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను సాధించటానికి దోహదపడింది.

అవసరమైనప్పుడల్లా తమ విలువైన సమయాన్ని ఈ ప్రాంతపు కళాశాలల్లో సేమినార్స్ కొరకు వినియోగిస్తూ, విద్యార్ధుల బంగరు భవితకై తల్లిదండ్రుల, అధ్యాపకుల నిరంతర కృషిలో మన చందు సాంబశివరావు గారు భాగస్వామ్యులవుతున్నారు.ఈ కార్యక్రమాలను అందరి నుండి, మరీ ముఖ్యంగా యువతనుండి అందుతున్న విశేష స్పందన మరిన్ని కార్యక్రమాలను చేపట్టడానికి దోహదపడుతున్నది.

చిన్నప్రయం నుండి కులమతాలకతీతంగా అపరిచితులను పరిచితులుగా చేసుకొంటూ,పరిచితులలో నిజమైన స్నేహితులను వెతుక్కుంటూ మన చందు సాంబశివరావు గారు ఎంతో మందికి ఆప్త మిత్రులు అవటమే కాక, మిత్రులే తమ సంపదని సగర్వంగా చెప్పుకొంటూ వుంటారు.ప్రాథమిక స్థాయి నుండి ఇప్పటి వరకు తన జీవిత మార్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఉపాధ్యాయులే తనకు దైవ సమానులుగా భావిస్తూ, వారిని గుర్తించి, గౌరవిస్తూ, ఆదరించడం మన చందు సాంబశివరావు గారి ప్రత్యేకత.

నిస్వార్ధ ప్రజాసేవే జీవిత లక్ష్యంగా చేసుకున్న తమ మామగారైన శ్రీ గరికపాటి వెంకటనారాయణ దొర (దొరస్వామి) గారి ఆశీస్సులతో మరియు తమ శ్రీమతి చందు అనురాధ గారి పూర్తి సహకారంతో మన చందు సాంబశివరావు గారు చేపట్టి నిర్వహిస్తున్న అన్ని ప్రజాహిత కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
చందు సాంబశివరావు
M.S., M.S., M.B.A., P.M.P.


చందు అనురాధ (భార్య)
చందు భరత్ (కుమారుడు)
చందు పృధ్వీ (కుమారుడు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి