6, మార్చి 2009, శుక్రవారం

chandu

తెనాలి నియోజకవర్గము - చందు సాంబశివరావు గారి ఆవశ్యకత
గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్ నందు కాపు సమజికవర్గం అధిక సంఖ్యలో వున్నారు. కొత్తగా ఏర్పడిన రేపల్లె, బాపట్ల, పొన్నూరు, వేమూరు, తెనాలి నియోజకవర్గాలలో కాపులు అధికంగా వున్నారు.వీరు వీరు పోటీ చేసే పార్టీల బలాబలాలను ప్రభావితం చేసే స్థాయిలో వున్నారు.

తెనాలి డివిజన్ నుండి 1954 లో దుగ్గిరలనుండి వేమూరు నాగేశ్వరావు, 1955, 62, 67 లో రేపల్లె నుండి యడం చెన్నయ్య, 1985 లో బాపట్ల నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, 2004 లో వేమూరు నుండి సతీష్ పాల్ రాజ్ గెలుపొందారు.తెలుగుదేశం పార్టీ 1985 లో బాపట్ల, 94, 99, 04 సంవత్సరాలలో కాపు అభ్యర్ధులకు దుగ్గిరాల నుండి సీటు ఇస్తున్నారు.

నేడు తెనాలి డివిజన్ నందరి రేపల్లె నందు కాపు సామజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వేమూరు S.C. రిజర్వుడు, రేపల్లె B.C. సామజిక వర్గాలకు ఇవ్వవలసి యున్నందున తెనాలి నియోజకవర్గాన్ని కాపులకు కేటాయిస్తే గెలవటానికి ఆస్కారం ఉంటుంది.

2004 ఎన్నికలలో దుగ్గిరాల అసెంబ్లీ నుండి ఓటమి పొందిన చందు సాంబశివరావు ఈ నియోజకవర్గ భాద్యతలను స్వీకరించి పార్టీని నమ్ముకుని పార్టీకి వీరి సేవలను అందించారు. వీరి నియోజకవర్గమునుండి Z.P. చైర్స్ పర్సన్ ఎన్నుకోబడినది.ఇచ్చట కొల్లిపర కాంగ్రెస్సు కు కంచుకోటగా ఉంది. వీరిని ఎదుర్కొని పార్టీకి సేవ చేయటం మామూలు విషయం కాదు.

పునర్విభజన అనంతరం తెనాలి నియోజకవర్గం నందు దుగ్గిరాల నియోజకవర్గంలోని కొల్లిపర మండలం మొత్తము మరియు కొలకలూరు, హఫ్పేట, గ్రామములలోని 55,000 మంది ఓటర్లు వీరికి పరిచయస్తులు.ఈ నియోజకవర్గంలో కాపు సామజికవర్గము నుండి ఓట్లు ఎక్కువ సంఖ్యలోనుండుట (12% ఓటర్లు) కావున చందు సాంబశివరావు గారు (విద్యావేత్త, శాస్త్రవేత్త, ఐటి మరియు కంప్యూటర్ నిపుణుడు.నిజం చెప్పాలంటే వీరు దుగ్గిరాల నుండి పోటీ చేసేటప్పుడు వీరి యొక్క బయో డేటా ప్రజలకు తెలియదు) పోటీ చేస్తే గత నియోజకవర్గం నందు వున్న సానుభూతి పని చేస్తుంది.

2004 ఎన్నికలలో కాంగ్రెసు సునామి గాలిలో అందరూ కొట్టుకుపోయారు. చందు సాంబశివరావు గాక ఎవరైనా ఐతే వెంకట రెడ్డి గారు 30,000 మెజారిటి తో గెలిచేవారు.

2004 ఎన్నికలలో!
కాంగ్రెసు పార్టీకి రెడ్డి, కాపు, S.C. సామజిక వర్గాల మద్దతు ఉండేది.
తెలుగు దేశం పార్టీకి కమ్మ, B.C. వర్గాల మద్దతు ఉండేది.
నేడు ప్రజారాజ్యం పార్టీకి కాపు సామజిక వర్గం సహకరిస్తోంది. కావున కాంగ్రెసు పార్టీకి 4.5% మేర నష్టం జరుగుతోంది. కాబట్టి కాంగ్రెసు పార్టీకి తెనాలి నియోజకవర్గా విజయం నల్లేరు మీద నడక అనుకునేవారు.కాని అది సాధ్యం కాదు.ఈ నియోజకవర్గం నుండి గెలుపు, ఓటములు చాలా తక్కువ మెజారిటి తో వస్తాయి. కాపు అభ్యర్దిని రంగంలో దించితే వారి యొక్క సామజిక వర్గం నుండి 30% ఓట్లు చీల్చ గలుగుతాడు.చందు సాంబశివరావు గారు వివాద రహితుడు అందుచే అన్ని సామజిక వర్గాల నుండి ఆయనకు మద్దతు లభించును.

1 కామెంట్‌: